షాంపూలో కేవలం దీనిని కలిపితే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుందా ???
షాంపూలో కేవలం దీనిని కలిపితే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుందా ???
సాధారణంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కలుషిత నీటి కారణంగా చాలామందిలో చిన్న వయసులోనే జుట్టు నెరుస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య
ఎక్కువగా కనబడుతోంది. అలా ఏర్పడిన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఒక ఆయుర్వేద పద్ధతి ఉంది. సాధారణంగా మనం వాడే షాంపూలో కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ ని కలిపి వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుందని
ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సహజ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో అర లీటరు నీటిని తీసుకుని గ్యాస్ స్టవ్ మీద వేడి
చేయాలి.ఈ నీరు కాస్త కాగాక దీంట్లో రెండు టీ స్పూన్ల టీ పొడి, రెండు టీ స్పూన్ల మెంతి గింజలు రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి కలిపి ఈ నీరు పావు లీటర్ అయ్యేంతవరకు సన్నని మంట మీద వేడి చేయాలి. తర్వాత ఈ నీటిని చల్లబరిచి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో
భద్రపరచుకోవాలి. ఇక మనం ప్రతిసారి తలస్నానం చేసేటప్పుడు షాంపూ ని నేరుగా తలపై వాడకుండా ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో ఒక అర కప్పు మనం తయారు చేసి పెట్టుకున్న హెర్బల్ నీటిని కలిపి జుట్టుకు పట్టించి శుభ్రంగా తలంటుకోవాలి. వారానికి రెండు నుంచి మూడుసార్లు ఈ షాంపూ తో తలస్నానం
చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడం ప్రారంభమవుతుంది. అయితే కేవలం ఒకటి, రెండు సార్లకు మాత్రమే మార్పు రాదు.కొన్ని నెలలపాటు ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా కనపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
Video Link to Above mentioined Data: HEALTH TIPS IN TELUGU
మరిన్ని ఆసక్తికరమైన హెల్త్ టిప్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా విజిట్ చేయండి. SRI KARUNA
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి